భారతదేశం, అక్టోబర్ 6 -- ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా 4 రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదలై మొదటి రోజు రూ. 88 కోట్ల వసూళ్లు రాబట్టింది. శుక్రవారం కూడా తన జోరును కొనసాగించి దాదాపు రూ. 65 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు శనివారం 25% వృద్ధితో రూ. 82 కోట్లు వసూలు చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లు రాబట్టింది.
మూడు రోజుల్లో కాంతార చాప్టర్ 1 సినిమా ఇండియాలో రూ.195 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో రూ. 40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం (అక్టోబర్ 5) కలెక్షన్లు కలిపి ఈ చిత్రం భారతదేశంలో రూ. 250 కోట్లకు పైగా, విదేశాల్లో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 కలెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.