భారతదేశం, నవంబర్ 10 -- నిర్మాత కరణ్ జోహార్ హిట్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. ఇది చాలా పాపులర్. ఇందులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. సినిమా, క్రికెట్ స్టార్లు కనిపించారు. కానీ భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి అనే ఒక పెద్ద పేరు ఇప్పటికీ మిస్సవుతోంది. అనుష్క శర్మ అనేకసార్లు హాజరైనప్పటికీ, విరాట్ రాలేకపోవడానికి గల కారణం హార్దిక్ పాండ్యా-కేఎల్ రాహుల్ వివాదమేనని కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా పోడ్‌కాస్ట్ 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. ఈ సంభాషణలో కాఫీ విత్ కరణ్ షోకి రావడానికి నిరాకరిస్తూనే ఉన్న సెలబ్రిటీ ఎవరు అని సానియా అడగగా, కరణ్ 'రణబీర్ కపూర్' పేరు చెప్పాడు. "అతను గతంలో వచ్చాడు. కానీ గత మూడు సీజన్ల నుండి అతను రానని చెప్పాడు" అని రణబీర్ పంచుకున్నాడు. రణబ...