భారతదేశం, జూలై 28 -- చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారతీయుల గమ్యస్థానం కెనడా అవుతోంది. కెనడా బహుళ సాంస్కృతిక వాతావరణం, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ కారణంగా భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తోంది. మెక్​గిల్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్​స్టిట్యూషన్ (DLI)లో ప్రవేశం పొందాలి. ఈ నేపథ్యంలో కెనడాలోని టాప్​ యూనివర్సిటీలు, టాప్​ కోర్సులతో పాటు అప్లికేషన్​ ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాము..

క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం, మెక్​గిల్ విశ్వవిద్యాలయం కెనడాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా, ప్రపంచవ్యాప్తంగా 27వ స్థానంలో నిల...