భారతదేశం, ఆగస్టు 16 -- శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వచ్చిందంటే కచ్చితంగా వినిపించే పాట 'జయ జనార్ధనా'. వాట్సాప్ స్టేటస్ లో, సోషల్ మీడియా రీల్స్ లో ఈ కృష్ణ స్తోత్రాలు మార్మోగుతూనే ఉన్నాయి. తమ పిల్లలను రెడీ చేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఈ స్తోత్రాలతో వీడియోలు తయారు చేస్తున్నారు. ఈ పవిత్ర కృష్ణ జన్మదినం రోజు మీరు కూడా ఈ శ్రీ కృష్ణ స్తోత్రాలను పఠించండి. ఇదిగో ఆ లిరిక్స్.

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే

జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే

జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

గరుడవాహనా కృష్ణా గోపికాపతే

నయనమోహనా కృష్ణా నీరజేక్షణా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే

జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే

మదనకోమలా కృష్ణా మాధవాహరే

వసుమతీపతే కృష్ణా వాసవానుజా

వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే

సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే

ము...