భారతదేశం, ఆగస్టు 2 -- శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో కృష్ణానది బ్యాక్‌వాటర్ ఉద్ధృతి పెరిగింది. దీని ప్రభావంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వరాలయం మరోసారి నీట మునిగింది. జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణాన్ని కృష్ణానది జలాలు పూర్తిగా చుట్టుముట్టాయి.

ఆలయం చుట్టూ నీరు చేరుకుంటున్న తరుణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ నది తల్లిని శాంతింపజేసేలా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరెసారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నది దేవత ఆశీస్సుల కోసం వేడుకుంటూ విశేష పూజాధికాలు నిర్వహించారు. కృష్ణమ్మ ప్రవాహం మరింత ఉద్ధృతంగా మారుతుండటంతో, వేపదారు శివలింగం రాబోయే కొన్ని రోజుల పాటు పూర్తిగా...