భారతదేశం, ఆగస్టు 16 -- కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడానికి రజనీకాంత్ ముఖ్య కారణం కావచ్చు, కానీ నాగార్జున, ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్ ఉండటం వల్ల సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో ఆదరణ లభించింది. ముఖ్యంగా నాగార్జున సైమన్ పాత్రలో క్రూరమైన విలన్‌గా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. కూలీ విజయంపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

కూలీ సినిమా రికార్డు కలెక్షన్లపై నాగార్జున రియాక్టయ్యారు. ఇది హిస్టారికల్ అని పేర్కొన్నారు. ''కూలీకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చారిత్రాత్మకం'' అని నాగార్జున అన్నారు. ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి, తమిళ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ఓపెనింగ్‌ను అందుకున్న మూవీగా నిలిచింది. నాగార్జున-రజనీ కలయికతో తెలుగు వెర్షన్, ఉత్తర అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ ...