భారతదేశం, ఆగస్టు 22 -- కూలీ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు తలైవా రజనీకాంత్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దండయాత్ర కొనసాగిస్తోంది. కూలీ చిత్రం వీకెండ్ లో వసూళ్లు తగ్గినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. థియేటర్లలో వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా రూ.450 కోట్ల దగ్గర్లో ఉంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ చిత్రం తొలి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ సోమవారం నుంచి తగ్గుదల మొదలైంది. గురువారం నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూలీ సింగిల్ డిజిట్ లో వసూళ్లు రాబట్టింది. అయితే ఓపెనింగ్ లో కూలీ ఇండియాలో రూ.230 కోట్ల నెట్ (రూ.273 కోట్ల గ్రాస్) వసూలు చేయగలిగింది. ఓవర్సీస్ మార్కెట్ లో21 మిలియన్ డాలర్ల (రూ.171 కోట్లు) కలెక్షన్లు అందుకుంది.

కూలీ సినిమా వన్...