భారతదేశం, ఆగస్టు 19 -- రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కలెక్షన్లు సోమవారం పడిపోయాయి. అయినప్పటికీ ఈ సినిమా రికార్డుల వేటలో కొనసాగుతోంది. సూపర్ స్టార్ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ డే కలెక్షన్లు, మూడు రోజుల్లో రూ. 150 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు అయిదు రోజుల మొత్తం కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

కూలీ సినిమా అయిదు రోజుల్లో భారత్ లో రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. సక్నిల్క్ ప్రకారం సోమవారం (ఆగస్టు 18) ఈ రజనీకాంత్ సినిమా ఇండియాలో రూ.9.36 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో మొత్తం కలెక్షన్ రూ.203.86 కోట్లకు చేరింది. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ...