Hyderabad, ఆగస్టు 15 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 79వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా జరుపుకున్నాడు. తన ఇంటిపైనే అతడు జెండా ఎగరేయడం విశేషం. దేశవ్యాప్తంగా ఈ వేడుకలను ప్రతి ఒక్క భారతీయుడూ ఘనంగా జరుపుకుంటున్న వేళ చరణ్ కూడా దీనికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు.

శుక్రవారం (ఆగస్టు 15) దేశమంతా 79వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ వేడుకను జరుపుకుంటూ ఆ ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్ లో షేర్ చేస్తున్నారు. తాజాగా తెలుగు సూపర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడు. అందులో చరణ్ ఇంటిపై రెపరెపలాడుతున్న జెండాను చూడొచ్చు.

ఆ తర్వాత తన కూతురు క్లిన్ కారాతో కలిసి ఆ జెండాకు అతడు సెల్యూట్ చేయడం కూడా కనిపిస్తుంది. అంతేకాదు స్టాఫ్ తో కలిసి కూడా ఇంటి కింద మరోసారి అతడ...