భారతదేశం, జూలై 28 -- అటు బాక్సాఫీస్ దగ్గర.. ఇటు సోషల్ మీడియా ట్రెండింగ్ లో బాలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ 'సైయారా' (Saiyaara) అదరగొడుతోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. ఈ రొమాంటిక్ మూవీ పదో రోజు కూడా వసూళ్ల జోరు కొనసాగించింది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ కెరీర్ లోని అతిపెద్ద రొమాంటిక్ మూవీ 'చెన్నై ఎక్స్ ప్రెస్' వసూళ్లను సైయారా బీట్ చేసింది.

తొలి సినిమా 'సైయారా'తో అనీత్ పడ్డా, అహాన్ పాండే కలిసి రొమాన్స్ కింగ్ షారుఖ్ ఖాన్‌ను ఓడించారు. సక్నిల్క్ ప్రకారం ఈ రొమాంటిక్ డ్రామా షారుఖ్ ఖాన్ కెరీర్ లోని అతిపెద్ద రొమాన్స్ చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' (2013) జీవితకాల వసూళ్లను అధిగమించింది. సైయారా పదో రోజైన ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 247.25 కోట్లకు చేరింది....