Hyderabad, జూన్ 9 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్యోతీష శాస్త్రం ప్రకారం, జూన్ 9న కుజుడు సింహ రాశిలో ఉండగా చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీంతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. మహాలక్ష్మి రాజయోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం తీసుకు వస్తుంది.

వృశ్చికరాశిలోకి సంచరిస్తున్న చంద్రునిపై కుజుడి దృష్టి ఉంటుంది. దీనితో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. మహాలక్ష్మి రాజయోగం వలన జూన్ 11 వరకు ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలను ఇస్తుంది. మరి మహాలక్ష్మి రాజయోగంతో ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఎవరు ఎలాంటి అదృష్టాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ కొద్దిపాటి సమయంలో మీ జీవితంలో అనేక మార...