భారతదేశం, నవంబర్ 11 -- ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నాడు. మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసినందుకు రెహమాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెహమాన్ తో తరచుగా కలిసి పనిచేసే సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని ఓ నెటిజన్ ప్రశ్నించినప్పుడు.. తాను రెహమాన్ ను ప్రశ్నించినట్లు సంచలన విషయాన్ని బయటపెట్టింది.

పెద్ది మూవీ కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి ఫొటో దిగినందుకు, పనిచేసినందుకు ఏఆర్ రెహమాన్ పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక 'ఎక్స్' యూజర్ చిన్మయిని టార్గెట్ చేస్తూ.. రెహమాన్ ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. "అక్క (చిన్మయి) మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రెహమాన్. ఆమెది దొంగల నైజం!!" అని ఆ యూజర్ ప...