Hyderabad, సెప్టెంబర్ 19 -- ప్రతి ఒక్కరూ కూడా మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. ఒక్కొక్కరి ప్రవర్తన, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది చాలా సున్నిత మనస్కులు అయితే, కొంత మంది చాలా మొండిగా ఉంటారు. కాళ్ల వేళ్లను బట్టి కూడా మనం ఏంటనేది తెలుసుకోవచ్చు. కాలి వేళ్ళ పొడవు వ్యక్తిగత లక్షణాలని సూచిస్తుందని తెలుగు సంప్రదాయ నమ్మకాలు తెలుపుతున్నాయి. మరి మీ కాలి వేళ్లను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి.

కొంత మందికి బొటన వేలు కంటే రెండవ వేలు పొడవుగా ఉంటుంది. అలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా వీళ్ళు ధైర్యవంతులు. ఎప్పుడూ ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారు.

అదే విధంగా ఇతరుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సమస్యల్ని కూడా ఎప్పుడూ సమర్థవంతంగా ఎదుర్కొంటారు. లక్ష్యాలని సాధించాలని ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు.

బొటన వేలు పొడుగ్గా ఉండి మిగిలిన వేళ్ళ...