భారతదేశం, నవంబర్ 17 -- హిందూ ధర్మంలో ఆవును గోమాతగా భావిస్తారు. సకల దేవతలు గోవులో కొలువై ఉన్నారని నమ్ముతారు. అందుకనే ఇలాంటి శుభకార్యాలు, వేడుకలు వంటివి జరిగినప్పుడు ఆవుకు కచ్చితంగా ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. ప్రతిఏటా కార్తీక మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు గోపాష్టమి జరుపుతారు. ఆ రోజు గోవులకు స్నానం చేయించి, అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది.

ఈ ఏడాది గోపాష్టమి నవంబర్ 17, అంటే ఈరోజు వచ్చింది. గోపాష్టమి వేడుకలు అసలు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ పండుగకు కృష్ణుడి బాల్యంతో ప్రత్యేక సంబంధం ఉందట. పురాణాల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఆసక్తికరమైన కథ దీని వెనుక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

పురాణాల ప్రకారం చూస్తే, కృష్ణుడు సుమారు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు తన తల్లి యశోదమ్మతో ఇలా అన్నాడట. "అమ్మా! నేను పెద్దవాడిని అయ్యాను. దూడలను మేపడా...