భారతదేశం, నవంబర్ 13 -- హిందూ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 24, మంగళవారం నాడు వచ్చింది. ఆ రోజు విష్ణుమూర్తి, పరమశివుడిని భక్తితో ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

చాలా మంది నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేయడం, దీపాలు వెలిగించడం వంటివి పాటిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు. ఆ రోజు దీపాలను వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని నమ్మకం.

కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుడి ఆగడాలతో దేవతలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అతని బారి నుంచి రక్షించాలని దేవతలు శివుని ప్రార్థిస్తారు.

దేవతల ప్రార్థనలతో శివుడు ప్రసన్నుడై, ఒకే ఒక్క బాణంతో త్రిపురాసురుడి మూడు నగరాలను నాశనం చేస్తాడు. శివుడ...