Hyderabad, ఆగస్టు 25 -- స్టార్ మా ఛానెల్‌లో దూసుకుపోతున్న సీరియల్స్‌లో నెంబర్ వన్ ప్లేసులో కార్తీక దీపం 2 సీరియల్ ఉంటుంది. ఇదివరకు వచ్చిన కార్తీక దీపం సీరియల్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీరియల్ తెచ్చుకున్నంత రేంజ్‌లో మరే ఇతర ధారావాహిక క్రేజ్ సాధించలేకపోయింది.

ఇక గత కొంతకాలంగా కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్‌గా కార్తీక దీపం నవ వసంతం పేరుతో ధారావాహిక ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా టెలీకాస్ట్ అయిన కార్తీక దీపం 2 స్టార్ మాలోని ఇతర సీరియల్స్‌ను దాటేసి టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతోంది.

ఒక స్టార్ మాలోనే కాకుండా బుల్లితెర సీరియల్స్‌లోనే టాప్‌లో సత్తా చాటుతోంది కార్తీక దీపం 2 సీరియల్. అయితే, కార్తీక దీపం 2లోని ముఖ్య పాత్రల్లో సుమిత్ర ఒకటి. కార్తీక్‌కు అత్తగా, దీపకు కన్నతల్లిగా, అలాగే జ్యోత్స్నకు తల్లిగా ఈ పాత్ర ఉం...