భారతదేశం, మే 29 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో నష్ట పరిహారం కావాలంటూ సూరజ్ డైరెక్ట్ గా ఇంటికే రావడంతో జ్యోకు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. వీడియో ప్రూఫ్స్ తో సూరజ్ గట్టి దెబ్బే కొడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 29 ఎపిసోడ్ లో చూసేయండి.

సోషల్ మీడియాలో సూరజ్ స్టాల్ ధ్వంసం వీడియో కింద కామెంట్లను కార్తీక్ చదువుతాడు. ఇందులో కొన్ని జ్యోత్స్నను తిట్టేవి ఉంటే, మరికొన్ని ఏమో సూరజ్ కల్తీ ఫుడ్ అమ్ముతున్నాడేమోనని ఉంటాయి. నా బిజినెస్ పై, నాపై జనాల్లో నమ్మకం పోయింది. నాకు న్యాయం కావాలి. సాయంత్రం వరకు టైమ్ ఇస్తాను. నాకు నష్టపరిహారం ఇప్పించండని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు.

సూరజ్ లాంటి వీధి గూండాలను ఎంకరేజ్ చేస్తే, రోజుకు ఒకరు ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. వాడొక వేస్ట్ ఫెలో తాత. వాడి గురించి ఆలోచించడం కూడా వేస...