భారతదేశం, ఆగస్టు 25 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లి ఎలా ఆపాలనే ప్లాన్ కోసం జ్యోత్స్న, పారిజాతం, శ్రీధర్ మాట్లాడుకుంటారు. శౌర్యను కిడ్నాప్ చేస్తున్నానని జ్యో అంటుంది. ఐడియా అదిరిపోయింది. ఏ రోజుకైనా నువ్వే నా కోడలివి. నా కొడుక్కి నేను చేసే మంచి ఏమైనా ఉందంటే అది నిన్ను ఇచ్చి పెళ్లి చేయడమే అని జ్యోతో శ్రీధర్ అంటాడు. మామయ్య శౌర్యను నువ్వే కిడ్నాప్ చేయాలని శ్రీధర్ తో జ్యో చెప్తుంది. ఓకే అని శ్రీధర్ వెళ్లిపోతాడు.

కార్తీక్, దీప పెళ్లి జరుగుతుంది. అప్పుడే వెళ్లిన పని సక్సెన్ అని జ్యోత్స్న, పారుకు చెప్తాడు శ్రీధర్. ఎక్కడ దాచావని అడిగితే సైలెంట్ గా ఉండమని చెప్తాడు. కాలం నీ కథను ఎంత వింతగా రాసిందో చూశావా మరదలా. నిన్ను పరాయి దానిలా చూస్తున్న సుమిత్ర అత్త నీ కన్న తల్లి. కానీ నువ్వు ఆవిడకు శత్రువు. ఇక్కడ నిలబడ్డవాళ్లంతా...