భారతదేశం, సెప్టెంబర్ 16 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో నా భార్య, కూతురికి బయటకు వెళ్లే పని ఉంది. అందుకే మధ్యాహ్నం నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్లాలనుకున్నామని శివన్నారాయణను అడుగుతాడు కార్తీక్. ఓ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్లిపోండి అని శివన్నారాయణ అంటాడు. ఈ డ్రాయింగ్ గీసింది ఎవరు? అని శౌర్యను ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. అడ్డంగా దొరికిపోయామని కార్తీక్ అనుకుంటాడు.

ఈ డ్రాయింగ్ లో ఉన్నవాళ్లు ఎవరని అడిగితే శౌర్య ఆన్సర్ చెప్తుంది. మధ్యలో ఉన్నది ఎవరంటే.. నేనే అని చెప్పేలోపే కార్తీక్ దగ్గుతాడు. దీంతో ఏమో తెలియదని శౌర్య అంటుంది. కానీ ఈ పాప ఎవరో తెలిస్తే బొమ్మలు కొందామని అనుకున్నానే అని శివన్నారాయణ అనగానే నాకు కొంటారా? అని శౌర్య అంటుంది. కానీ బర్త్ డే నీదేనా అంటే మాత్రం చెప్పదు. చంటిదాని బర్త్ డే అని మాట వరసకైనా మాకు చెప్ప...