భారతదేశం, అక్టోబర్ 6 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో సాంబార్ చేయమని దీపకు సుమిత్ర చెప్తుంది. అబద్దాలు చెప్పి చెప్పి అదే నీ జీవితమైంది. ఈ రోజు నా కూతురు గెలిచి ఇంటికి వస్తుంది. ప్రేమగా భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్లు తిరిగి పడిపోతే ఇబ్బందిగా ఉంటుంది. నా కూతురి జీవితంలోకి ఏ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. పాడు చేయడానికి ప్రయత్నిస్తావు. ప్లీజ్ దీప నన్ను ఈ ఒక్క పూట అయినా నా కూతురితో కడుపు నిండుగా తిననివ్వమని సుమిత్ర అంటుంది.

మమ్మల్ని పట్టించుకోవా? అని దీపను పారిజాతం అడుగుతుంది. బంగాళదుంపలు దీప తీసుకొస్తే, ఏదైనా కారంగా పెట్టమని అడుగుతుంది దీప. బయట గడ్డి ఉంది తింటానని పారు అంటే, గడ్డితో జ్యూస్ చేస్తానని దీప చెప్తుంది. దమ్మిడి ఆదాయం లేకుండా మీరెలా బతుకుతున్నారు? ఏ ధైర్యంతో బతుకుతున్నారు? అని పారు అడుగుతుంది. మా బావ ఉన్నా...