Hyderabad, అక్టోబర్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్‌ తనకు గొడవ ఉందని, నువ్వు అడ్డు రావొద్దని కార్తీక్‌తో వైరా అంటాడు. అడ్డొస్తే నువ్వు ఎక్కిన కారు లారి గుద్దొచ్చు. నీ ఫ్యామిలీకి ఏమైనా జరగొచ్చు. నీకు చిన్న కూతురు ఉందని విన్నాను. మనం చేసే పనులకు కుటుంబం ఎఫెక్ట్ అవ్వొద్దుగా అని వైరా వార్నింగ్ ఇస్తాడు.

నిన్ను చూసి నలుగురు భయపడినట్లు అందరూ అలాగే ఉంటారనుకుంటున్నావ్. నాలాంటి వాడు నీకు ఇంకా తగల్లేదు. నా కూతురు గురించి మాట్లాడావు కదా. ఊరిలో ముందుగా పోతురాజు విగ్రహం పెడతారు. ఊరి జోలికి రాకూడదని వార్నింగ్ అది. నా కుటుంబానికి నేను పోతురాజ్‌ను. నా కూతురు జోలికి వస్తే కత్తితో ఏస్తాను. నేను డ్రైవర్‌ని కారును నడుపుతాను. కంపెనీని నడుపుతాను. అవసరం అయితే రెండు రిపేర్ చేస్తాను అని కార్తీక్ రివర్స్ వార్నింగ్ ఇస్తాడు.

వేలంలో నేను నష్టపోడ...