భారతదేశం, ఆగస్టు 27 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 27వ తేదీ ఎపిసోడ్ లో అంగరంగ వైభవంగా దీప, కార్తీక్ పెళ్లి జరుగుతుంది. ముందుగా శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటారు. కాంచన, శ్రీధర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇది మా అమ్మ తాళి. మా అన్నయ్య నాకిచ్చిన మాట నీ కారణంగా నిలబడితే మా నాన్న మా అమ్మను నీతో పాటు ఇచ్చి నా ఇంటికి పంపిస్తున్నాడని కాంచన అంటుంది. ఆ తర్వాత సుమిత్ర, దశరథ ఆశీర్వాదం తీసుకుంటారు. అందరు కలిసి ఫ్యామిలీ ఫొటో దిగుతారు.

అందరూ కూర్చుని భోజనాలు చేస్తుంటారు. అప్పుడు దీప అదనంగా మరో ఆకు వేసి భోజనం వడ్డించమంటుంది. పారు అడిగితే మా నాన్న వస్తారని దీప చెప్తుంది. నేను బతికున్నంత కాలం మా నాన్న నాతోనే ఉంటాడని దీప అంటుంది. శివన్నారాయణ కూడా దీపకు మద్దతుగా మాట్లాడుతాడు. మేనకోడలు తాళి తీసింది కదా అని పారుతో శ్రీధర్ అంటాడు. మామయ్య కూడా తీయకపోతే ఇ...