భారతదేశం, సెప్టెంబర్ 10 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో నమ్మకం పోతే దోషిలాగే చూస్తారని జ్యోత్స్నకు చెప్తుంది సుమిత్ర. ఏరా డ్రైవర్, ఎంప్లాయిస్ ను ఇంటికి పంపించింది నువ్వే కదా అని కార్తీక్ తో పారిజాతం అంటుంది. సీఈఓ పోస్టుకు నువ్వు కర్చీఫ్ వేసుకున్నావని నాకు తెలుసు. ఈ వంకతో జ్యోత్స్నను ఓడించి సీఈఓ అయిపోదామనే కదా పెద్దాయనను బుట్టలో వేసుకున్నావని పారు అంటుంది.

జ్యోత్స్న నా మనవరాలు. దాన్ని గెలిపిస్తాను చూడు కార్తీక్ తో ఛాలెంజ్ చేస్తుంది పారిజాతం. జ్యోత్స్నను ఎలాగైనా కాపాడాలని పారు అనుకుంటుంది. నమ్మకం గురించి సుమిత్ర అన్న మాటలను గుర్తు చేసుకుంటున్న దీప దగ్గరకు కార్తీక్ వస్తాడు. అత్త మాటలకు అందరూ షాక్. నువ్వు చెప్పినట్లే అత్త చెప్పింది. మీరు తల్లీకూతురు కదా అని కార్తీక్ అంటాడు. చివర్లో నమ్మకం గురించి చెప్పిన మాటలు నాకు కూడా...