భారతదేశం, ఆగస్టు 12 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 12వ తేదీ ఎపిసోడ్ లో రాత్రి జ్యోత్స్న ఫోన్ చేసిందని వెళ్లి కలుస్తాడు కార్తీక్. ఎంత డ్రైవర్ అయితే మాత్రం ఇలా రాత్రి ఫోన్ చేసి పిలుస్తారా? మాకూ ఓ ఫ్యామిలీ ఉంది. వాళ్లతో టైమ్ స్పెండ్ చేయాలి కదా అని కార్తీక్ అంటాడు. కాసేపు బావ మరదల్లా మాట్లాడుకుందామా అని జ్యో అంటే.. పిలుపు మారినంత మాత్రాన పద్ధతి మారదు కదా చిన్న మరదలా అని కార్తీక్ అంటాడు. తాత నీ పెళ్లికి ఒప్పుకునేలా చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది జ్యోత్స్న.

నీ మాటలు కొత్తగా ఉన్నాయి బావ. అవసరం లేకపోయినా మాటలు పడుతున్నాయి. అందివచ్చిన అవకాశాలు వదులుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావ్? ఎందుకు కన్నీళ్లు దాచుకుని పైకి నవ్వుతున్నావ్? అని జ్యోత్స్న అడుగుతుంది. నా ఫ్యామిలీ కోసం అని కార్తీక్ అంటాడు. నీ ఫ్యామిలీ ఏంటీ? మన ఫ్యామిలీ కదా అ...