భారతదేశం, ఆగస్టు 18 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్ లో దీపే కావాలని తాళి తెంచుకుందని అన్నావా లేదా అని పారిజాతాన్ని గద్దించి అడుగుతాడు కార్తీక్. తప్పులు చేసే మనుషులు రెండు రకాలు. టైప్ 1 వీళ్లకు రెండు దెబ్బలు పడితే రెండోసారి తప్పు చేయరు. టైప్ 2 దులుపుకుపోయే రకమని కార్తీక్ అంటాడు. దెబ్బలకు భయపడదు పారు అని పారిజాతం అంటుంది.

సరే ఓ ఛాలెంజ్ అని గుమ్మం బయట సర్కిల్ గీస్తాడు కార్తీక్. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు నిన్ను మెడ పట్టుకుని మా తాతతో ఈ రింగ్ లోకి గెంటించక పోతే నా పేరు కార్తీక్ కాదు అని సవాలు విసురుతాడు కార్తీక్. నువ్వు ఓడిపోతే నేను ఏం చెప్పినా వినాలి, ఏం చెప్పినా చేయాలని పారు అంటుంది. మార్నింగ్ కలుద్దామని పారుకు చెప్పి కార్తీక్, దీప వెళ్లిపోతారు. ఈ సారి కార్తీక్ కు దొరకకూడదు అని పారు అనుకుంటుంది.

దీప పెళ్లి జరగడం ఇష్...