Hyderabad, ఆగస్టు 23 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను పూలతో అలంకరించు మమ్మీ అని సుమిత్రకు జ్యోత్స్న పూలు ఇస్తుంది. కానీ, ఆ మల్లెపూలను నేలపై విసిరికొడుతుంది సుమిత్ర. మనిషికి చావు ఎలా ఉంటుందో తెలియదు. కానీ నా చావు ఇలా ఉంటుంది. నేను ఎవరికో ఏదో తప్పు చేశాను. అందుకే దీని కన్నతల్లి నా చావును కంది అని సుమిత్ర అంటుంది.

నా కన్నతల్లిని అనొద్దు అని దీప అంటే నీ కన్నతల్లి ఎవరో నీకు తెలుసా అని జ్యో అంటే.. తెలియదని దీప అంటుంది. ఏ తల్లి ఏ బిడ్డను ఇంకొకరు చావును కనదు అని దీప అంటుంది. కానీ, నీ తల్లి మాత్రం నాకు మనశ్సాంతి లేకుండే చేసుందుకే కనింది అని సుమిత్ర అంటుంది. మీ కాళ్లు పట్టుకుంటాను. నా తల్లిని ఏమనొద్దు అని దీప అంటుంది.

ఇంతలో దశరథ్ సుమిత్ర అనుకుంటూ వస్తాడు. అది విని కిందపడేసిన మల్లెపూలు తీసుకుని ప్రేమగా నటిస్తూ దీపకు పెడుతుంది సుమి...