భారతదేశం, సెప్టెంబర్ 24 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో తన భర్తను కావాలనే షూట్ చేశానని ఒప్పుకొంటే దీపను క్షమిస్తానని సుమిత్ర అంటుంది. నేను ఒప్పుకుంటున్నా బావ అని దీప అనేసరికి అందరూ షాక్ అవుతారు. నేను తప్పు చేశానని దీప అంటుండంతో కార్తీక్ ఆమెను లాగి పడేస్తాడు. చూసిందే నిజం కాదత్తా, జరిగిందే నిజం అని సుమిత్రతో కార్తీక్ అంటాడు. మామయ్యకు తగిలిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్ లో నుంచి రాలేదు. అసలు దీప పట్టుకున్న గన్ పేలనే లేదని కార్తీక్ అంటాడు.

దీపను కాపాడుకోవడానికి నువ్వు సాక్ష్యాలు కొనేశావురా అని కార్తీక్ తో సుమిత్ర అంటుంది. నువ్వు మీ అమ్మ మీద ఒట్టు వేసి చెప్పినా నేను నమ్మను అని సుమిత్ర అంటుంది. ఎందుకంటే దీప గన్ తో జ్యోత్స్నను చంపే ప్రయత్నం చేసింది. అప్పటికీ నువ్వింకా రాలేదు. నేను ఇక్కడే ఉన్నా. చంపొద్దని బతిమిలాడానని సుమిత...