భారతదేశం, సెప్టెంబర్ 23 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్, దీపతో సుమిత్ర ప్రేమగా మాట్లాడుతుంది. లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందామని చెప్తుంది. శ్రీధర్ భోంచేద్దామని శివన్నారాయణ పిలుస్తాడు. అన్నయ్య కోసం కాంచన పాలకోవా తీసుకుని వస్తుంది. కానీ దీపను క్షమించి, హత్తుకున్న తర్వాతే ఆనందంతో పాలకోవా తింటానని దశరథ అంటాడు. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి పాలకోవా తినిపించే వెళ్తావు. నీకో సర్ ప్రైజ్ ఉందని అంటాడు దశరథ.

అందరికీ సుమిత్ర వడ్డిస్తుంది. పారిజాతానికి డైట్ ఫుడ్ పెట్టమని చెప్తాడు కార్తీక్. మసాలా ఫుడ్ తింటానంటే వద్దంటాడు. దీప ఇది నువ్వు నాకు నేర్పిన వంటే, ఈ కర్రీ తిను అని ప్రేమగా వడ్డిస్తుంది సుమిత్ర. ఒకవైపు భయంగా, మరోవైపు తట్టుకోలేనంత భయంగా ఉంది బావ అని కార్తీక్ తో దీప అంటుంది. ఏంటే ఇది ఎక్కడో తేడా కొడుతుందని జ్యోత్స్నతో ...