భారతదేశం, అక్టోబర్ 29 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో గుడిలో దశరథను చూసి సుమిత్ర దాక్కుంటుంది. ఆమె తలలోని పూలు కిందపడిపోతే దశరథ తీసుకుంటాడు. ఈ రోజు నా పెళ్లి రోజు. నా భార్య నాతో రాలేదు. ఇద్దరి పేరున అర్చన చేయండని దశరథ అంటాడు. సుమిత్ర, దశరథ అని కార్తీక్ పేర్లు చెప్తాడు. ఇంతకుముందే ఇదే పేరుతో అర్చన చేయించారని పూజారి చెప్తాడు. సుమిత్ర అయి ఉంటుందని దశరథ అంటాడు.

దీప అత్తను త్వరగా తీసుకొస్తే బాగుండని కార్తీక్ అనుకుంటాడు. మనుషులు వద్దనుకున్నప్పుడు ఈ మనిషి కోసం పూజలెందుకు అని సుమిత్ర అనుకుంటుంది. సుమిత్ర అక్కడ పెట్టిన కుంకుమను బొట్టుగా పెట్టుకుంటాడు దశరథ. దశరథ వెళ్లిపోయాక ఆ పూలను కళ్లకు అద్దుకుని జడలో పెట్టుకుంటుంది సుమిత్ర. మరోవైపు ఇల్లు మొత్తం వెతికాను మమ్మీ లేదని జ్యోత్స్నకు కోపం వస్తుంది. తప్పించుకోలేవు దీప, మమ్మీ ఎక్కడుందో చెప...