భారతదేశం, ఫిబ్రవరి 25 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో.. డాడీ ఎలా నీ కూతురు కాంచన ఇంటి కోడలు అయింది? అని దశరథను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. దశరథ కూతురు దీప అయితేనే ఇది సాధ్యమవుతుందని అనసూయ చెప్తుంది. బంధాలు, మాటలు మారిపోనప్పుడు నువ్వెందుకు డాడీ అలా మాట్లాడాలి. అమ్మానాన్న చచ్చిన ఈ అనాథ మెడలో బావ తాళి కట్టాడని జ్యోత్స్న అంటుంది.

దీప అనాథ కాదు. దీపకు అమ్మానాన్న ఉన్నారు. దీప అమ్మానాన్న బతికే ఉన్నారు. వాళ్లెవరో చెప్పడానికి ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. నా చెల్లి నా దగ్గర తీసుకున్న మాట ఎలా నెరవేరిందని అడిగావు కదా జ్యోత్స్న అని దశరథ అంటాడు. దానికి సమాధానం నేనే చెప్పాలి మామయ్య. ఎందుకంటే నా భార్య గురించి జ్యోత్స్న మాట్లాడుతుంది. నా పెళ్లి మీ అమ్మానాన్న చేతుల మీదుగా జరిగింది కదా. అప్పుడు మీ నాన్న దీపకు తండ్రి అవుతాడని కార్తీక్...