భారతదేశం, సెప్టెంబర్ 30 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో కళ్లు తిరిగి పడిపోయిన దీపను లేపి తినమని భోజనం తెచ్చిస్తుంది సుమిత్ర. భోజనం పెట్టేంత మానవత్వం ఉంది కానీ తినిపించేంత ప్రేమ లేదు. నువ్వు మీ ఇంట్లో పడిపోతే ఇంత కంగారు పడేదాన్ని కాదు. అందరి ఉన్నప్పుడు పడిపోయిన నా బదులు వేరేవాళ్లు భోజనం పెట్టేవాళ్లు. కానీ టైమ్ చూడా ఎలా వచ్చిందో? ఇంట్లో ఎవరు లేరు. నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి వదిలేద్దామనుకున్న నాలోని అమ్మతనం ఒప్పుకోదని సుమిత్ర అంటుంది.

నీకేదైనా జరిగితే నువ్వుంటే నాకిష్టం లేదు కాబట్టి నేను చేశాననుకుంటారని దీపతో సుమిత్ర అంటుంది. నిజంగా మనుసులో నుంచే మాట వచ్చిందా? అని దీప అడుగుతుంది. తింటూ వినమని ప్లేట్ ఇస్తుంది సుమిత్ర. ఇదివరకు దీప, సుమిత్ర మధ్య ఉన్న బంధం వేరు. అప్పుడు దీపకు ఆవేశం, నిజాయతీ ఉండేది. ఇప్పుడు స్వార్థం పెరిగి...