భారతదేశం, జూలై 28 -- కార్తీక దీపం 2 టుడే జులై 28వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు మీ అమ్మను చూసుకోవడానికి ఎప్పుడైనా ఇంటికి రావొచ్చని దాసుతో శివన్నారాయణ అంటాడు. గ్రానీ కొడుక్కి గతం గుర్తొచ్చింది, కానీ గుర్తు లేనట్లు నటిస్తున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఏదో ఒక రోజు ఈ తండ్రి దగ్గరకే కూతురుగా పంపిస్తా జ్యోత్స్న అని కార్తీక్ అనుకుంటాడు. అందరకీ బై చెప్పేసి దాసు వెళ్లిపోతాడు. ఎప్పుడో దాసును గుర్తిస్తే, నీ కొడుకు, కూతురును అనాథను చేసేదాన్ని కాదుగా అని పారిజాతం అనుకుంటుంది.

దీప చిన్న మేడం భోజనం చేయలేదు కదా వండించు అని కార్తీక్ అంటాడు. పనివాళ్లు పనివాళ్లతో కూర్చుని భోంచేస్తే పనివాళ్లు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని పారుకు సెటైర్లు వేస్తాడు కార్తీక్. బయటకు వెళ్లిపోతున్న దాసును ఆపుతాడు దశరథ్. నిన్ను నా కూతరు కొట్టిందే అది గుర్తుందా? నిన్ను ఎందుకు కొట్టింది? ...