భారతదేశం, మే 28 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 టుడే మే 28 ఎపిసోడ్ లో.. దక్షిణామూర్తిని కాపాడిన విషయంలో శివ నారాయణతో కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడి తప్పు చేశావ్రా అని చెప్పు తాత, నా వ్యక్తిత్వాన్ని నీ ముందే ఉరి తీసి ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. నువ్వు మౌనంగా ఉన్నావంటే తప్పు చేశానని నమ్ముతున్నావని కార్తీక్ అంటాడు.

తప్పు చేసిన వ్యక్తికి నీ ముందు నిలబడే అర్హత లేదు. వెళ్లిపోతున్నానని కార్తీక్ రెండు అడుగులు వేస్తాడు. వెంటనే కార్తీక్ చేయిని శివ నారాయణ పట్టుకుని ఆపుతాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతే ఇన్నాళ్ల శివ నారాయణ ఆదర్శానికి పాడె కట్టినట్లే. నా ఆవేశం, కోపం నాలోని మంచితనాన్ని చంపేశాయని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు.

నువ్వు మనవడిగా నా ధర్మాన్ని క...