భారతదేశం, సెప్టెంబర్ 25 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో ఏంటో ఈ మనుషులు అని కాంచన బాధపడుతుంది. సుమిత్ర కుటుంబం గురించి ఆలోచించలేదు, కానీ దీప ఆలోచించొచ్చు కదా అని శ్రీధర్ అంటుంది. చూసినవాళ్లకు దీపే దశరథ బావను షూట్ చేసినట్లు కనిపిస్తుంది. నేను ఓ తప్పు చేశా. దాన్ని ఒప్పుకున్నా. సుమిత్ర తప్పు ఒప్పుకొంది. దీప ఎందుకు వదులుకోవాలి. దీప ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. తప్పు చేసింది నేనే అని ఒప్పుకో అని శ్రీధర్ అంటాడు.

నా భార్య, కొడుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నీ వల్లే ప్రారంభమయ్యాయి. నీకు నష్టం జరగకుండా ఉండటం కోసం వీళ్లందరి జీవితాలు బలైపోయినా పర్వాలేదా అని శ్రీధర్ అనగానే.. ఇక చాలు ఆపు మాస్టారూ అని కాంచన చేతిలోని స్వీట్ బాక్స్ తీసుకుని కోపంతో విసిరేస్తాడు కార్తీక్. ఇది నా కుటుంబం, నీ సలహాలు, సూ...