భారతదేశం, సెప్టెంబర్ 29 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో అమ్మానాన్న ఇద్దరు ఎంత మంచివాళ్లో అంత మొండివాళ్లు. నాన్నంటే నన్ను మొదటి నుంచి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆశతో వెళ్లా. కానీ ఇలాంటి సలహాలు ఇవ్వొద్దని పద్ధతిగా చెప్పారు. ప్రేమించే భర్తకు భార్య గురించి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్ తో దీప అంటుంది. ఇద్దరు కిచెన్ లో వంట చేస్తుంటారు. మీరిద్దరు మాట్లాడుకోవడం జ్యోత్స్న చూసింది. దీంతో చిన్నపాటి పంచాయితీ జరిగింది.

జ్యోత్స్న మాటలు విని మా అమ్మ తన సొంత ఆలోచనను చెడగొట్టుకుంది. తన వ్యక్తిత్వాన్ని చెడగొట్టింది. పెద్ద దోషిగా మిగిలిపోయింది. మా అమ్మనాన్న ఇద్దరూ మొండివాళ్లే అని దీప అంటుంటే.. అది జ్యోత్స్న, పారిజాతం వింటారు. ఆగిపోయావేం చెప్పు.. మీ అమ్మనాన్న ఇద్దరూ మొండివాళ్లేనా అని జ్యోత్స్న అడుగుతుంది. మీ అమ్మ చిన్నప్పుడే...