భారతదేశం, మే 18 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. సీఈఓ పదవి తనదే అని మురిసిపోయిన జ్యోత్స్నకు కార్తీక్, దశరథ షాక్ ఇస్తారు. ఆ పోస్టు కోసం జ్యోత్స్న, దీప మధ్య ఓటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 18 ఎపిసోడ్ లో చూసేయండి.

వణుకుతున్న చేతులతో చీటీ తీసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ చీటీపై దీప అనే పేరు ఉంటుంది. దీపకు ఇంకొక్క ఓటు వచ్చినా గెలుపు ఎవరిదో అందరికీ అర్థమైపోతుంది, తీయండి మేడం అని కార్తీక్ అంటాడు. ఇది దీప అని వచ్చిందంటే నా పదవి, పరువు రెండూ ఒకేసారి పోతాయని జ్యో అనుకుంటుంది. ఆ చీటీని చూసి జ్యోత్స్న కళ్లు పెద్దవి చేస్తుంది.

కానీ ఆ చీటిలో జ్యోత్స్న అని పేరు ఉండటంతో కార్తీక్, దీప కంగుతింటారు. జ్యో రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఓట్లు ఇద్దరికీ సమానంగా వచ్చాయి, ఇప్పుడెలా? అన...