భారతదేశం, జూన్ 9 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీపతో కలిసి సూరజ్ పని చేయడం.. దక్షిణామూర్తి గురించి శివ నారాయణ చెప్పడం.. సీఈఓ రేసు కోసం పోటీతో కథ రసవత్తరంగా సాగుతోంది. కార్తీక దీపం 2 టుడే జూన్ 9 ఎపిసోడ్ లో జ్యోత్స్న కుట్రను సూరజ్ అడ్డుకుంటాడు. రెస్టారెంట్ సీజ్ చేయకుండా కాపాడతాడు.

ఆఫీస్ లో మరోసారి జ్యోత్స్న వర్సెస్ సూరజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. జ్యోత్స్నను అలాగే చూస్తుంటాడు సూరజ్. అది చూసి జ్యో కంగారు పడుతుంది. అలా ఎందుకు చూస్తున్నావంటే.. ఫోకస్ చేస్తున్నానని సూరజ్ చెప్తాడు. ఇక్కడ మహిళలపై వేధింపులను అస్సలు సహించం. కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని జ్యో అంటుంది. అయినా తన ఫోకస్ కరెక్ట్ గానే ఉందని సూరజ్ చెప్తాడు.

నన్ను గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నావని జ్యో అడుగుతుంది. మీరు అనుకోవడం కాదు, చూస్తున్...