భారతదేశం, డిసెంబర్ 16 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ లో కార్తీక్, శ్రీధర్ కలిసి రోడ్డు పక్కన టీ తాగుతూ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం త్వరగా అమ్మకు చెప్పాలని కార్తీక్ అంటే, ఇప్పుడే వద్దంటాడు శ్రీధర్. ఇంకా కొన్ని చోట్లా పికప్ కావాల్సి ఉందంటాడు. సక్సెస్ కు, మనకు 30 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ ఓ స్టోరీ చెప్తాడు కార్తీక్.

కంపెనీకి నష్టాలు సరిగ్గా బిజినెస్ చేయకపోవడం వల్ల రాలేదు, వచ్చిన లాభాలు లెక్కల్లో చూపించకపోవడం వల్ల వచ్చాయి. జ్యోత్స్న చేసిన అరాచకాలు. లెక్క బయటకు చెప్తే శివ నారాయణ గుండె పట్టుకుని పడిపోయేంత. జ్యోత్స్న శివ నారాయణ మనవరాలు కాదు అని శ్రీధర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.

కారు దగ్గర వెయిట్ చేస్తున్న కాశీని చూస్తూ నీ మనవడి తలరాత నువ్వు తప్పించొచ్చు కదా అని పారిజాతాన్ని రెచ్చగొడు...