భారతదేశం, సెప్టెంబర్ 18 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో శౌర్య కోసం పెద్ద కేకు తెచ్చానని పారిజాతం తెగ బిల్డప్ కొడుతుంది. పారిజాతం నువ్వు కేక్, చాక్లెట్లు తీసుకుని వచ్చేయ్. ఈ ఖర్చుల కోసం డబ్బు ఇచ్చానని చెప్పిన సంగతిని శివన్నారాయణ బయటపెడతాడు. శ్రీధర్ తనను పికప్ చేసుకున్నాడని పారు చెప్తుంది. చిన్నమ్మ, చెల్లి రాలేదా మాస్టారూ అని కార్తీక్ అడుగుతాడు. రాలేదని శ్రీధర్ అంటాడు. శౌర్యతో కేక్ కటింగ్ కు ముందు ఇంకో పని చేయాల్సి ఉందని సుమిత్ర అంటుంది.

ఆ మనిషి గురించి చెప్పు అని సుమిత్ర అడుగుతుంది. అదే మామయ్య లాకెట్ దొరికింది కదా ఆ మనిషి అని సుమిత్ర అంటుంది. నేను చెప్తానని చిన్నప్పుడు కోనేరులో కార్తీక్ మునిగిపోవడం, ఓ అమ్మాయి వచ్చి కాపాడటం, ఆ అమ్మాయి లాకెట్ కార్తీక్ దగ్గర ఉండిపోయిందని జరిగిన దాని గురించి పారు చెప్తుంది. ఈ విషయం నాకు ...