భారతదేశం, ఆగస్టు 20 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో ఆవేశంతో కార్తీక్ కు నిజాలు చెప్పేస్తోంది పారిజాతం. లాస్ట్ నంబర్ చెప్పేస్తున్నా వన్ అని అనేలోపు శివన్నారాయణ వెనకాల నుంచి పారును బయటకు గెంటేస్తాడు. చెప్పింది జరిగింది కదా పారు అని కార్తీక్ అంటాడు. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను పారిజాతం అని శివన్నారాయణ చెప్తాడు. నేనే ఫోన్ చేశానని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పుడు దెయ్యాన్ని చూస్తున్నా. నువ్వు పైకే కాదు లోపల కూడా దెయ్యానివని సీరియస్ గా అంటాడు శివన్నారాయణ.

అప్పుడే దశరథ్, సుమిత్ర, జ్యోత్స్న వస్తారు. శ్రీధర్ కు ఫోన్ చేసి పెళ్లికి రావొద్దని చెప్పిందంటా అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ పెళ్లికి నాన్న రావట్లేదా అని అడుగుతాడు దశరథ్. కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఎలా ఉంటాడు సార్ అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న, పారు ష...