భారతదేశం, ఫిబ్రవరి 10 -- కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో.. తల్లి కాంచనకు కాల్ చేసి దీప వచ్చిందా? అని కార్తీక్ అడుగుతాడు. రాలేదని కాంచన చెప్తుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేసి దీప ఇక్కడే ఉంది, త్వరగా రమ్మని చెప్తుంది. కార్తీక్ కంగారుగా వెళ్తాడు.

హాస్పిటల్ కు వచ్చేముందు నాకు చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్లావని వెతకాలి. ఇంత అర్జెంట్ గా వచ్చి డాక్టర్ ను కలవాల్సిన అవసరం ఏముంది? అత్తకు ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది కదా అని కార్తీక్ అంటాడు. సరిపోదు బావ, ఆపరేషన్ చేయించకపోతే అమ్మ చనిపోతుందని దీప ఏడుస్తుంది. దీప తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడిందని డాక్టర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.

ప్లీజ్ బావ నేను ఒప్పుకుంటున్నానని డాక్టర్ కు చెప్పు. నాకు వేరే దారి లేదు బావ. నన్ను క్షమించు. నా త...