Hyderabad, జూలై 1 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కట్టమన్నంత డబ్బు కట్టి కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేపిస్తాను అని శ్రీధర్ బాధతో అంటాడు. నేను అంత దీన స్థితిలో లేను. నువ్ మారినంత ఈజీగా అందరూ మారరు. గాయాలన్ని పచ్చిగానే ఉన్నాయని కార్తీక్ అంటాడు. బావ నాకోసం ఏం మాట్లాడుకుండా ఉండు అని దీప అనేసరికి కార్తీక్ సైలెంట్‌గా ఉంటాడు.

కాంచన నేను నీతో ఉంటాను. నాతో ఉండు అని శ్రీధర్ అంటే ఒకరికి దానం ఇచ్చింది తిరిగి అడుగుతారా అని కాంచన అంటుంది. లేదు. దానం ఇచ్చాం కదా అని శ్రీధర్ అంటాడు. నేను నిన్ను కావేరికి అలాగే ఇచ్చాను. మళ్లీ ఎలా అడుగుతాను. ఎలా కోరుతాను అని కాంచన ఏడుస్తూ చెబుతుంది. నాకు భర్త లేడు. కానీ, ఐదోతనం ఉంది. నాకు నా కొడుకు, కోడలు చాలు. వాళ్లతో ఉంటే పేదరికంలో ఉంటే ఐశ్వర్యంలో ఉన్నట్లే. మీరింకా బయలుదేరొచ్చు అని కాంచన అంటుంది....