భారతదేశం, జూలై 29 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 29వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో శివన్నారాయణ బాధపడుతుంటాడు. దీప ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మీ మనవరాలిని పెళ్లిని కళ్లారా చూస్తారు. మీ ముని మనవళ్లలో ఆడుకుంటారని దీప అంటుంది. దీప చెప్పే ప్రతి మాట నిజమవుతుందని దశరథ అంటాడు. నిజమయ్యే మాటే నా భార్య చెప్పిందని కార్తీక్ జ్యోకు కౌంటర్ ఇస్తాడు. నేను అసలైన వారసురాలని కాదని బావకు తెలిసిందనుకో నన్ను ఇంట్లో ఉండనివ్వడు అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న గురించి తెలుసుకుంటానని దశరథ.. నా గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు డాడీ అని జ్యోత్స్న అనుకుంటారు.

మరోవైపు ఇంట్లో కుబేర్ ఫొటో పట్టుకుని అనసూయ ఎమోషనల్ అవుతుంది. ఆ ఫొటో చేయి జారి కింద పడిపోతుంటే దీప పట్టుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అత్తయ్య అని అడిగితే.. మీ నాన్న ఆబ్దికం గురించ...