భారతదేశం, జూన్ 10 -- Karthika Deepam 2 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజురోజుకూ అత్యంత ఆసక్తికరమైన ట్విస్టులతో సాగుతోంది. జ్యోత్స్న ఆడిన బొద్దింక డ్రామాను సూరజ్, కార్తీక్ కలిసి అట్టర్ ఫ్లాప్ చేశారు. నిజం బయటపడటంతో సుమిత్ర, శివనారాయణ జ్యోత్స్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 10 నాటి పూర్తి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

బొద్దింక డ్రామా వెనుకాల ఉంది జ్యోత్స్ననే అనే నిజం రెస్టారెంట్ దగ్గరే అందరికీ చెప్పకుండా ఎందుకు ఆపావని దీపను సూరజ్ అడుగుతాడు. "ఇలాంటి ఛాన్స్ మళ్లీ వస్తుందా? ఇది తెలిస్తే శివనారాయణ గారు జ్యోత్స్నను అసహ్యించుకునేవారు, మీరు సీఈఓ అయ్యేవాళ్లు కదా" అని సూరజ్ అంటాడు.

దానికి దీప సమాధానమిస్తూ.. "ఆ రెస్టారెంట్ పెద్దయ్యగారి భార్య పేరు మీద ఉంద...