భారతదేశం, సెప్టెంబర్ 19 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్ కన్నకూతురు శౌర్య కాదంటూ జ్యోత్స్న లేని గొడవ క్రియేట్ చేస్తుంది. ఈ మాట అనే అర్హత నీకు ఉందా? అని జ్యోపై దశరథ ఫైర్ అవుతాడు. శౌర్య పట్ల కార్తీక్ కు బాధ్యత ఉంది. అందుకే శౌర్యను కూతురిగా చూసుకునే అర్హత తనకు ఉంది. ఇదే మాట మా చెల్లి అనడానికి అధికారం ఉంది ఎందుకంటే తల్లి కాబట్టి. వాళ్ల జీవితం వాళ్లు బతుకుతున్నారు. వాడికి మనం రుణపడి ఉన్నాం. వాడికి మనల్ని అనే అర్హత ఉంది. కానీ నీకు శౌర్య, కార్తీక్, దీపను నిందించే అర్హత లేదు అని దశరథ మండిపడతాడు.

అర్హత లేకపోవచ్చు డాడీ కానీ నేను మాట్లాడే దాంట్లో తప్పు లేదు. తప్పు ఉందని ఒక్కరినైనా చెప్పమను అని జ్యోత్స్న అనగానే.. తప్పు ఉందని నేను చెప్తున్నానని పారిజాతం షాక్ ఇస్తుంది. నీకు ఈ మధ్య ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదని ...