Hyderabad, జూన్ 26 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపపై పారిజాతం దొంగతన వేయడం, కార్తీక్ తిప్పికొట్టడంపై అనసూయ మెచ్చుకుంటుంది. నీ మేనకోడలు ఏమో పని మనిషిని చేసింది. నీ పిన్నేమో దొంగను చేసింది అని అనసూయ అంటుంది. దాంతో నా మేనకోడలు అని నన్ను దెప్పుతున్నట్లు ఉందని అలుగుతుంది కాంచన. నాకు మేనకోడలు అంటే దీపనే గుర్తుకు వస్తుందని కాంచన అంటుంది.

వాళ్లు తీసిన గుంతలో వాళ్లే పడతారు. లేకుంటే నేను పడేసే రకం అని కార్తీక్ అంటాడు. ఇన్ని అవమానాలు పడుతూ వాళ్ల ఇంట్లో ఉండటం దేనికి, ఏం సాధించడానికి. జ్యోత్స్న పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. లేదా ఇక్కడే ఉండి అజమాయిషీ చెలాయిస్తుంది అని కాంచన అంటుంది. దీప అసలైన వారసురాలు. అది బయటపెట్టడానికే ఇదంతా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

మీ భవిష్యత్తు ఏంటో మాకు తెలియాలి కదే అని అనసూయ అంటే నా భవిష్యత్తు బ...