భారతదేశం, అక్టోబర్ 3 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు, నేను ఒకటి కాదు మరదలా సారీ పెద్ద మేడం గారు. మీరు ఓనర్లు, మేం వర్కర్లమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. నువ్వు దాసు మామయ్య కూతురివి నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరని లోపల అనుకుంటాడు కార్తీక్. నేను కూతురు కొడుకును, నువ్వు కొడుకు కూతురివి రెండు వేరు కదా. ఇంట్లో నా మీద పగ సాధించేది నువ్వే కదా అని కార్తీక్ అంటాడు. నా పగ నీ మీద కాదు దీప మీద అని జ్యో అంటుంది. పగలు మానేసి కంపెనీని నష్టాల్లో నుంచి బయటకు రప్పించమని కార్తీక్ అంటాడు.

మైండ్ గేమ్ లు ఏంటో తెలియకుండానే శౌర్యను అడ్డుపెట్టుకుని మమ్మీని, దీపను అడ్డుపెట్టుకుని డాడీని మార్చాలని చూస్తున్నావ్ కదా బావ అని జ్యోత్స్న అంటుంది. ఈ తెలివి తేటలు వాడే కదా అత్తయ్య, మామయ్యను విడదీశావని కార్తీక్ అనగానే జ్యో షాక్ అవుతుంది. వేలం ...