భారతదేశం, ఆగస్టు 26 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ లో మత్తు మందు కలిపిన పాలను దీపకు తీసుకెళ్లేందుకు జ్యోత్స్న బయల్దేరుతుంది. ఇంతలో పని మనిషి వచ్చి నాన్న పిలుస్తున్నారని చెప్తే.. పనిమనిషికి పాల గ్లాస్ ఇచ్చి దీపకు ఇవ్వమని చెప్తుంది. కానీ ఆ గ్లాస్ తీసుకుని పారిజాతం పాలు తాగేస్తుంది. శ్రీధర్ వేగంగా వెళ్లి గ్లాస్ లాగేస్తాడు అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ప్లాన్-ఎ మామయ్య నాశనం చేశాడు ప్లాన్-బి నువ్వు నాశనం చేశాడని జ్యోత్స్న మండిపడుతుంది. నా ప్లాన్ నా మీదే వర్కౌట్ చేశావా అని మత్తులో తూలుతుంది పారు.

దశరథ వచ్చి జ్యోత్స్నను తీసుకెళ్తాడు. పారును చేయి పట్టుకుని తీసుకెళ్తాడు శ్రీధర్. ఈ పెళ్లి అయ్యే వరకు నా పక్కనే ఉండమ్మా అని జ్యోత్స్నకు చెప్తాడు దశరథ. ఆడవాళ్లను పలకరించడానికి పక్కన నువ్వు ఉండాలి కదా. ఎందుకు ఊగుతున్నావ్? నిన్...