Hyderabad, జూన్ 23 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో వర్కర్స్‌ను ఒప్పించి పంపించిన తర్వాత పారుకు శ్రీధర్ కాల్ చేసి తనకంతా తెలుసని చెబుతాడు. సమస్య క్లియర్ అయితే మా ఆయన ఏది అడిగిన ఇస్తా అని అన్నాడు అదే టెన్షన్‌గా ఉందని పారిజాతం అంటుంది. గోవిందా గోవిందా. ఇంకేం అడుగుతాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అంటాడని శ్రీధర్ అంటాడు.

అలా జరిగితే మా ఆయన చంపేస్తాడు. నేనే నోరు జారాను. దానివల్లే నీ కొడుకుకి మా ఆయన మాటిచ్చాడు అని పారిజాతం అంటాడు. అయితే మిమ్మల్ని మావయ్య గారు గెంటేస్తారు. మా ఇంటికి వచ్చేయండి. మనమంతా కలిసి చెమ్మ చెక్క ఆటలు ఆడుకుందాం అని శ్రీధర్ అంటాడు. మీకు బుద్ధిలేదని పారిజాతం కాల్ కట్ చేస్తుంది. శివ మావయ్య నీకు నా కొడుకే కరెక్ట్ అని శ్రీధర్ అనుకుంటాడు.

ఇంట్లో పెద్ద సార్ ఏదో మాట ఇచ్చారు అని కార్తీక్ అంటాడు. నేను మాటిచ్చాను అడుగు అన...