భారతదేశం, ఫిబ్రవరి 9 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో.. సుమిత్ర ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే కార్తీక్, దీప స్కూటీ మీద వస్తారు. అమ్మా టిఫిన్ చేశారా అని దీప అడిగితే, ఎవరమ్మా నువ్వు అని సుమిత్ర షాక్ ఇస్తుంది. అత్త తను దీప, నా భార్య అని కార్తీక్ అంటాడు. అత్త అని పిలుస్తున్నావ్, నువ్వు ఎవరు బాబు అని సుమిత్ర డబుల్ షాక్ ఇస్తుంది.

దశరథ వచ్చి.. సుమిత్ర మనం లోపలకి వెళ్దామని చేయి పట్టుకుంటాడు. కానీ మీరు ఎవరు? నా చేయి పట్టుకుంటున్నారని సుమిత్ర అంటుంది. నేను నీ భర్తను, ఇది మన ఇల్లు అని సుమిత్రను దశరథ లోపలికి తీసుకెళ్తాడు. మీ అమ్మకు మతి పోయినట్లుందే అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. సుమిత్రకు ట్యాబ్లెట్ వేసి పడుకోబెడతాడు దశరథ.

అత్తకు ఏమైంది? ఎవరిని గుర్తు పట్టడం లేదేంటీ? అని దశరథను కార్తీక్ అడుగుతాడు. దశరథ ఏడుస్తాడు. నేను ...